కొత్త దర్శకుడితో ఆర్ఎక్స్ 100 హీరో !

Published on Dec 19, 2018 10:30 pm IST

ఆర్ఎక్స్100 చిత్రం తో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు యువ హీరో కార్తికేయ. ఇక ఆయన ప్రస్తుతం ‘హిప్పీ’ అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈచిత్రాన్ని కలై పులి ఎస్ తాను ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే కార్తికేయ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దగ్గర పదేళ్లుగా అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అర్జున్‌ జంధ్యాల ఈ కొత్త చిత్రానికి దర్శకుడు. జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ నెల 27న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం :