యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటున్న సాహో మేకింగ్ వీడియో !

Published on Oct 23, 2018 11:49 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న సాహో మేకింగ్ వీడియో కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది. ఈరోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియో చేస్తుంటే అభిమానులు ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు వారికీ తగిన ప్రతిఫలమే దక్కింది.

హాలీవుడ్ సినిమా లో వుండే యాక్షన్ ఎపిసోడ్ తో మేకింగ్ వీడియో అదిరిపోయింది. దుబాయ్ లో చిత్రీకరించిన ఈ యాక్షన్ ఎపిసోడ్ కు 400 మంది పనిచేయగా హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ దీనికి నేతృత్వం వహించారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.

ఇక వీడియో లాస్ట్ లో స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. చివరి రెండు షాట్స్ కూడా అద్భుతమనే చెప్పాలి. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

మేకింగ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :