సాహో సాంగ్: రొమాంటిక్ మరియు స్టైలిష్ గా….!

Published on Aug 3, 2019 12:30 am IST

ముందుగా ప్రకటించిన విధంగానే నేడు “ఏచోట నువ్వున్నా” పూర్తి సాంగ్ ని విడుదల చేశారు. ఆస్ట్రియా దేశంలోని ఆల్ప్స్ పర్వతాలలో సాగిన రొమాంటిక్ సాంగ్ చాలా రిచ్ గా ఉంది. లొకేషన్స్ కి తగ్గట్టుగా ఆకట్టుకునే సింగిల్ కలర్ డిజైనర్ వేర్ లో ప్రభాస్,శ్రద్దా కపూర్ జంట చాలా ఆకర్షణీయంగా ఉంది.లవ్ యాన్తం పేరుతో విడుదలైన ‘సాహో’ సాంగ్ ఆకర్షణీయంగా సాగింది. ముఖ్యంగా శ్రద్దా కపూర్ చాలా సెక్సీ అప్పీరెన్స్ ఇచ్చారు. ఇక ప్రభాస్ ఈ పాటలో స్టైలిష్ గా కనిపించారు.

మొదటి సాంగ్ “సైకో సయ్యాన్” వలే ఈ పాట కూడా కొంచెం తెలుగు నేటివిటీ మిస్ అయ్యిందన్న భావన కలుగుతుంది. బాలీవుడ్ సంగీత దర్శకులు సాహో కి పనిచేస్తుండటం వలన సాంగ్స్ హిందీ నేటివిటీలో సాగుతున్నాయి. సాంగ్ చిత్రీకరించిన లొకేషన్స్ మాత్రం అద్భుతంగా ఉండి కొత్త భావనను కలిగిస్తున్నాయి.

ఈ పాటకు గురు రంధ్వాన్ సంగీతం సమకూర్చగా, హరి చరణ్ శేషాద్రి, తులసి కుమార్ పాడారు. కృష్ణ కాంత్ పాటను రచించడం జరిగింది. డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్టు 30న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :