బాలీవుడ్ లో “సాహో” డామినేషన్ కు ఈ ఉదాహరణ చాలు!

Published on Jul 23, 2019 5:09 pm IST

ఇప్పుడు ఆగష్టు 15 అంతా పోయి ఆగష్టు 30 కోసం డార్లింగ్ అభిమానులు ప్రతీ రోజు క్యాలండర్ చెక్ చేసుకుంటున్నారు.అది ఎందుకో కూడా ప్రత్యేకంగా కూడా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ మరియు శ్రద్దా కపూర్ లు హీరో హీరోయిన్లుగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మరియు భారీ బడ్జెట్ చిత్రం “సాహో”. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో కూడా అందరికి తెలిసిందే.మన దగ్గర ఈ చిత్రం కోసం జనాలు ఎంతగా ఎదురు చూస్తున్నారో బాలీవుడ్ ప్రజలు కూడా అంతకు మించే ఎదురు చూస్తున్నారు అని చెప్పడానికి “సాహో” టీజర్ నే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

మొత్తం మూడు భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ టీజర్ ఏకంగా 1 మిలియన్ లైక్స్ ను టచ్ చేసి ఒక రేర్ ఫీట్ ను అందుకుంది.ఒక దక్షిణాది సినిమాగా తెరకెక్కి బాలీవుడ్ సినిమాలు కూడా అందుకోలేని ఫీట్ ను సాహో అందుకొని చూపించింది.దీన్ని బట్టి సాహో డామినేషన్ బాలీవుడ్ లో ఏ స్థాయిలో ఉండబోతుందో అన్నది మనం అర్ధం చేసుకోవచ్చు.ఇప్పటి వరకు ఈ టీజర్ 44 మిలియన్ వ్యూస్ మరియు 1 మిలియన్ లైక్స్ ను సాధించి బాహుబలి తర్వాత మళ్ళీ బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం :

More