శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న యంగ్ హీరో చిత్రం !
Published on Nov 6, 2017 8:21 am IST

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవలే ‘జయ జానకి నాయక’ తో మంచి హిట్ అందుకుని అదే ఉత్సాహంలో మరొక సినిమా చేస్తున్నారు. శ్రీ వాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే వారణాసి, పొల్లాచ్చి వంటి లొకేషన్లలో షూటింగ్ పూర్తి చేసుకుని తాజాగా బళ్లారిలో భారీ, కీలకమైన షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. దీంతో సగం పైగా చిత్రీకరణ ముగిసింది. ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

‘సాక్ష్యం’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కూడా చాలా కొత్తగా ఉంది. సినిమా కథ మొత్తం ప్రకృతిలోని పంచభూతాలైన గాలి, నీరు, భూమి, ఆకాశం, నిప్పు వంటి ఐదు అంశాల చుట్టూనే తిరుగుతుందట. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో జగపతిబాబు, వెన్నెల కిశోర్, శరత్ కుమార్, మీనా వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook