జనవరి 1న గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ‘సఃకుటుంబానాం’

జనవరి 1న గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ‘సఃకుటుంబానాం’

Published on Dec 30, 2025 3:15 PM IST

Sahakutumbanam

నూతన సంవత్సరం కానుకగా ‘సఃకుటుంబానాం’ చిత్రం 2026 జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్‌పై ఉదయ్ శర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించారు. రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు.

ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య తదితర సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. అనివార్య కారణాల వల్ల గతంలో వాయిదా పడిన ఈ చిత్రాన్ని, 2026 కొత్త సంవత్సరంలో అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ జనవరి 1న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

తాజా వార్తలు