ఆచార్య నుండి సానా కష్టం ఫుల్ లిరికల్ వీడియో విడుదల!

Published on Jan 3, 2022 5:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్ కంపనీ మరియు మాట్మీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి మరియు అన్వేష్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి సానా కష్టం అంటూ ఒక లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పాట లో మెగాస్టార్ చిరంజీవి సరసన రెజీనా కాసాండ్రా ఆడి పాడింది. ఇప్పటికే విడుదలైన ఈ పాట ప్రోమో యూ ట్యూబ్ లో భారీ వ్యూస్ ను సాధించడం జరిగింది. ఈ పాట ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా ను ఫిబ్రవరి 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :