సూపర్ స్టార్ రజినీకాంత్ పై సచిన్ టెండుల్కర్ కీలక వ్యాఖ్యలు

Published on Oct 26, 2021 3:30 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ తను 40 ఏళ్లుగా సినీ పరిశ్రమ లో సేవలు అందించినందుకు గానూ కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ తో సత్కరించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా అవార్డ్ ను అందుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్ కి సినీ పరిశ్రమ కి చెందిన వారు, ప్రముఖుల విషేస్ తెలుపుతున్నారు.

ఈ మేరకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తమ సినిమా విడుదలైన ప్రతిసారీ అలజడి సృష్టించగల నటులు చాలా తక్కువ మంది అంటూ చెప్పుకొచ్చారు. తలైవా రజినికాంత్ ప్రతిసారీ అలా చేస్తూనే ఉన్నాడు అని అన్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు అభినందనలు అంటూ చెప్పుకొచ్చారు. రజినీ కాంత్ ను పొగుడుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :