విషాదం.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ కె నారంగ్ మృతి.!

విషాదం.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ కె నారంగ్ మృతి.!

Published on Apr 19, 2022 10:44 AM IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమ వద్ద ప్రముఖ నిర్మాత మరియు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అయినటువంటి నారాయణ్ దాస్ కె నారంగ్ కన్ను మూయడం టాలీవుడ్ లో ఒక్కసారిగా షాకింగ్ గా మారింది. అయితే వివరాల్లోకి వెళ్లినట్టు అయితే తాను గత కొంత కాలం నుంచి ఆనారోగ్యంతో బాధపడుతుండగా దానికి చికిత్స కూడా తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు దానికి చికిత్స తీసుకుంటూనే ఆయన తన 78వ ఏట స్టార్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు.

మరి నారాయ‌ణ దాస్ నారంగ్ 1946 జులై 27న జ‌న్మించారు. ఆయ‌న డిస్ట్రిబూట‌ర్‌గా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను విడుద‌ల చేశారు. నిర్మాత‌గా మంచిపేరు సంపాదించుకున్నారు. ఏషియ‌ర్ గ్రూప్ అధినేత గ్లోబ‌ల్ సినిమా స్థాప‌కుడు, ఫైనాన్సియ‌ర్‌కూడా ఆయిన ఆయ‌న చ‌ల‌న‌చిత్రరంగంలో అజాత‌శ‌త్రువుగా పేరుగాంచారు. తెలంగాణ‌లో పంపిణీదారునిగా ఆయ‌న మంచి పేరు ప్ర‌ఖ్యాతులు పొందారు. ఆయ‌న మృతి ప‌ట్ల తెలుగు చ‌ల‌న‌చిత్ర వాణిజ్య‌మండ‌లి, తెలంగాణ వాణిజ్య‌మండ‌లి త‌మ ప్ర‌గాఢ‌సానుభూతి తెలియ‌జేసింది.

అయితే ఈ విషాద వార్త విని టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా. అయితే ఆయన నిర్మాతగా “లవ్ స్టోరీ” మరియు “లక్ష్య” చిత్రాలు మంచి ఆదరణ తెచ్చుకోగా ఇప్పుడు మరిన్ని సినిమాలు తన బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో తెరకెక్కుతున్నాయి. అలాగే ఆయన ఆసియన్ సినిమాస్ కి కూడా అధినేత అని తెలిసిందే. మరి వారి అకాల మరణం తెలుగు సినిమా దగ్గర తీరని లోటు అని చెప్పాలి. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు