డిస్ లైక్స్ లో చరిత్ర సృష్టించిన “సడక్ 2” ట్రైలర్.!

Published on Aug 14, 2020 1:31 am IST


బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి నేరుగా డిజిటల్ గా విడుదల కానున్న బడా చిత్రాల్లో “సడక్ 2” కూడా ఒకటి. సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్, ఆలియా భట్, పూజా భట్ లాంటి అగ్ర తారలు నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను నిన్ననే యూట్యూబ్ లో విడుదల కాగా దీనికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఊహించని రేంజ్ లో ఈ ట్రైలర్ కు డిస్ లైకుల వరద ముంచేసింది. దీనంతటికీ ప్రధాన కారణం ఈ చిత్ర దర్శకుడు మహేష్ భట్ అని అందరికీ తెలుసు.

అలాగే ఈ చిత్రంలో ఆలియా భట్ కూడా కనిపిస్తుండటంతో సుశాంత్ అభిమానులు సహా అతని సానుభూతిపరులు భారీ స్థాయిలో డిస్ లైకులు కొట్టారు. అది కాస్తా ఏ స్థాయికి వెళ్ళింది అంటే మొత్తం యూట్యూబ్ చరిత్రలోనే అత్యధిక డిస్ లైక్స్ వచ్చిన వీడియో గా ఆరవ స్థానానికి దగ్గరలో (బహుశా టాప్ 5 కు కూడా వెళ్లొచ్చు) అలాగే మన దేశంలోనే టాప్ స్థానంలో నిలిచి ఈ వరస్ట్ రికార్డును అందుకుంది. మరి ఇదంతా ఎక్కడ ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More