సాయి ధరమ్ తేజ్ సినిమా షూటింగ్ షెడ్యూల్ మార్పు !

సాయి ధరమ్ తేజ్ సినిమా షూటింగ్ షెడ్యూల్ మార్పు !

Published on Feb 10, 2018 4:16 PM IST

సాయి ధరమ్ తేజ్ నటించిన “ఇంటెలిజెంట్” సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో నడుస్తోంది. ఈ సినిమా తరువాత సాయి కరుణాకర్ దర్శకత్వంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదట ఈ నెల 16 నుండి హైదరాబాద్ లో మొదలు పెడదాం అనుకున్నారు. కాని తాజా సమాచారం మేరకు 14 నుండే షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు చిత్ర యూనిట్.

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా డార్లింగ్ స్వామి మాటలు రాస్తున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్సియల్స్ బ్యానర్ లో కె.ఎస్.రామారావ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు