సాయి ధరమ్ తేజ్ సినిమా షూటింగ్ అప్డేట్ !

‘తొలిప్రేమ’ చిత్రంతో పవన్ కళ్యాణ్‌కు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో కే.ఎస్.రామారావ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా డార్లింగ్ స్వామి మాటలు రాస్తున్నారు.

ప్యూర్ లవ్ స్టోరీగా తెరకేక్కబోతున్న ఈ సినిమా సాయి కెరీర్లో మంచి చిత్రంగా నిలుస్తుందని సమాచారం. గోపి సుందర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 16 నుండి ప్రారంభంకానుంది. ఇకపోతే సాయి ధరమ్ తేజ నటించిన ‘ఇంటిలిజెంట్’ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. వినాయక్ స్టైల్ లో మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా లో కామెడీ బాగుందని తెలుస్తోంది.