టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ తండేల్ (Thandel). చందూ మొండేటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుండగా, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.
నేడు సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. తండేల్ మూవీ చిత్రీకరణ లో సాయి పల్లవి డిఫెరెంట్ ఎమోషన్స్ తో కూడుకున్న వీడియో అది. నటిగా తన పెర్ఫార్మెన్స్ ఈ చిత్రం లో ఎలా ఉండబోతుంది అనే విషయం వీడియోను చూస్తే తెలుస్తుంది. సాయి పల్లవి ఫ్యాన్స్ కి ఇది కచ్చితంగా ఒక ట్రీట్ అని చెప్పాలి. నాగ చైతన్య.మరియు సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడం తో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20, 2024న థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి