చైతు ‘లవ్ స్టోరీ’కి సాయి పల్లవి డబ్బింగ్ మొదలెట్టింది !

Published on Sep 20, 2020 5:35 pm IST

నాగచైతన్య హీరోగా చేస్తోన్న సినిమా ‘లవ్ స్టోరీ’ డబ్బింగ్ ఈ రోజు మొదలైనట్టు తెలుస్తోంది. మొదట సాయి పల్లవి తన పాత్రకు డబ్బింగ్ చెబుతుందట. వచ్చే నెల మొదటి వారం కల్లా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్ని పూర్తవుతాయట. శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అని అందరిలో ఆసక్తి ఉన్న సమయంలో ఆ ఆసక్తిని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్ తో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఇక మజిలీ లాంటి సూపర్ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్య హీరోగా.. ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా ఈ సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను రిలీజ్ చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుంది.

ఏమైనా ప్రస్తుతం టాలీవుడ్ లో బలమైన ఎమోషనల్ కథలతో సినిమాలు చేసే సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ములకు మంచి పేరు ఉంది. పైగా శేఖర్ తో పాటు చైతు, సాయి పల్లవి ముగ్గరు సక్సెస్ లో ఉన్నారు. అందుకే మొదటి ఈ సినిమా పై డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఆసక్తి చూపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More