అక్కడ జరుగుతున్న సాయిరామ్ శంక‌ర్ “రిసౌండ్” షూట్.!

అక్కడ జరుగుతున్న సాయిరామ్ శంక‌ర్ “రిసౌండ్” షూట్.!

Published on Dec 11, 2020 3:00 PM IST

sai ram shankar

మన టాలీవుడ్ మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంక‌ర్ హీరోగా ‘రిసౌండ్’ అనే యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతోంది. ఈ చిత్రం ద్వారా ఎస్‌.ఎస్‌. ముర‌ళీకృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. రాశీ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని సురేష్ రెడ్డి, అయ్య‌ప్ప‌రాజు, రాజారెడ్డి నిర్మిస్తున్నారు.

ఇంతకు ముందు లాక్‌డౌన్ అనంత‌రం హైద‌రాబాద్‌లో షూటింగ్ పున‌రుద్ధ‌రించి, కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ఒంగోలులో జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని ప్ర‌ధాన ఘ‌ట్టాల‌తో పాటు రెండు పాట‌ల‌ను చిత్రీక‌రిస్తున్న‌ట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది.

అలాగే ‘రిసౌండ్’ టైటిల్‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. ఇందులో ఓవైపు ఎంట‌ర్‌టైన్ చేస్తూ, మ‌రోవైపు యాక్ష‌న్‌తో అల‌రించే పాత్ర‌ను సాయిరామ్ శంక‌ర్ చేస్తున్నారు.సాయిప్ర‌కాష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్న ఈ చిత్రానికి స్వీకార్ అగ‌స్తి సంగీతం సమకూరుస్తుండగా ఎడిటింగ్‌: ఉపేంద్ర, ఫైట్స్‌: న‌బా స్టంట్స్‌, పీఆర్వో గా వంశీ – శేఖర్ లు వ్యవహరిస్తున్నారు.

తాజా వార్తలు