ఇంటర్వ్యూ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కవచం విడుదలకు ముందే లాభాలను రాబట్టింది !

Published on Dec 5, 2018 1:00 pm IST

సాక్ష్యం తరువాత యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 5వ చిత్రం కవచం. ఈచిత్రం డిసెంబర్ 7న విడుదలవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు . ఆ విశేషాలు మీకోసం..

కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడానికి గల కారణం ?

శ్రీనివాస్ మామిళ్ల గారికి ఇంతకుముందు చాలా సినిమాలకు కో డైరెక్టర్ గా చేసిన అనుభవం వుంది. ఇక ఈ కథ ఆయన నాకు చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆయన చెప్పింది చెప్పినట్లుగా తీశారు.

ఈ సినిమాలో మీపాత్ర గురించి ?

ఈచిత్రంలో నేను పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాను. తన మీద వచ్చిన ఆరోపణలను ఒక్క రోజులో ఎలా సాల్వ్ చేసుకొన్నాడనేదే ఈ కథ. స్క్రీన్ ప్లే చాలా రేసీ గా వుంటుంది. ట్విస్టులు కూడా అదిరిపోతాయి.

సినిమా గురించి ?

థ్రిల్లర్ నేపథ్యంలో సాగె కథ ఇది. యాక్షన్ తో పాట అన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయి. సినిమాలో మొత్తం నాలుగు సాంగ్స్ ఉంటాయి. ఇక సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎక్కడా డీవియేట్ కాకుండా రేసీ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుంటుంది ఈచిత్రం.

మీ మార్కెట్ కంటే మీ సినిమా బడ్జెట్ ఎక్కువగా అవుతుందని అంటున్నారు దాని గురించి ?

ఈసినిమాకు బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆల్రెడీ విడుదలకు ముందే శాటిలైట్ రూపంలో 20కోట్లు వచ్చాయి. మొత్తం 10కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చింది.

తేజ తో సినిమా ఎక్కడి వరకు వచ్చింది ?

తేజ గారి సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. కేవలం 70 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. ఇంకా మిగితా వర్క్స్ ఫినిష్ కావాలి. వచ్చే ఏడాదిలో ఫిబ్రవరిలో కానీ మార్చి లో విడుదలవుతుంది.

మీ తదుపరి చిత్రాల గురుంచి ?

ప్రస్తుతానికైతే ఇంకా ఏం అంగీకరించలేదు. రెండు , మూడు సినిమాలు లైన్లో వున్నాయి. త్వరలోనే వాటి గురించి క్లారిటీ ఇస్తాను. ప్రస్తుతానికైతే కవచం రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్నాను.

సంబంధిత సమాచారం :