నాగార్జున సరసన ‘సాయి ధరమ్ తేజ్’ హీరోయిన్ !

Published on Jan 26, 2020 5:33 pm IST

కింగ్ నాగార్జున టైటిల్ పాత్ర‌లో నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. అహిషోర్ సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఒక కీలక పాత్రను బాలీవుడ్ బ్యూటీ సాయి ధరమ్ తేజ్ సరసన రేయ్ మూవీలో హీరోయిన్ గా నటించిన సాయమి కెర్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సాయమి కెర్ ‘రేయ్’ తరువాత చేస్తోన్న తెలుగు సినిమా నాగ్ ‘వైల్డ్ డాగ్’నే కావడం విశేషం. ఆమెది రెగ్యులర్ క్యారెక్టర్ కాదనీ, పర్ఫార్మెన్సుకు బాగా ప్రాధ్యాన్యం ఉన్న పాత్రనీ, ఆ పాత్రకు ఆమె అయితే న్యాయం చేస్తున్న నమ్మకంతో ఆమెను తీసుకున్నారని తెలుస్తోంది.

ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తించిన విషయం తెలిసిందే. అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ విజ‌య్ వ‌ర్మను పోలీస్ శాఖ‌లో అంద‌రూ ‘వైల్డ్ డాగ్’ అని పిలుస్తుంటారు. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని తీర్చిదిద్దిన వైల్డ్‌ డాగ్ విజ‌య్ వ‌ర్మ పాత్ర‌లో అక్కినేని నాగార్జున అద్భుతంగా నటిస్తున్నారనీ, ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక కొత్త అనుభూతినిస్తుందనీ చిత్ర బృందం తెలిపింది. కింగ్ నాగార్జున హీరోగా, దియా మీర్జా ఒక కీలక పాత్రలో న‌టిస్తోన్న ఈ చిత్రానికి ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అహిషోర్ సాల్మోన్‌, నిర్మాత‌లు: నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి

సంబంధిత సమాచారం :

X
More