‘శైలజారెడ్డి అల్లుడు’ షూటింగ్ ముగించేశాడు !
Published on Jul 20, 2018 5:00 pm IST

మారుతీ దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. ఈరోజు తో ఒక్క సాంగ్ మినహా ఈచిత్రం యొక్క షూటింగ్ పూర్తయింది. సీనియర్ నటి రమ్య కృష్ణ ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో చైతు సరసన అనుఇమ్మాన్యుయేల్ నటిస్తుంది.

గత ఏడాది ‘మహానుభావుడు’ చిత్రంతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న దర్శకుడు మారుతీ ఈ చిత్రాన్ని కూడా చాలా కాన్ఫిడెంట్ గా తెరకెక్కిస్తున్నాడట. గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. చైతు నటిస్తున్న ఈ చిత్రం కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్ర వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం శైలజారెడ్డి అల్లుడు ఆగష్టు 31న ప్రేక్షకులముందుకు రానున్నాడు .

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook