ఫిదా చిత్రంలోని తన అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన సాయి పల్లవి తెలుగులో మంచి క్రేజ్ సంపాందించుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి హనురాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ కి జోడిగా ‘పడి పడి లేచె మనసు’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో సాయి పల్లవి క్యారెక్టర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం ‘పడి పడి లేచె మనస్సు’ చిత్రంలో సాయి పల్లవి ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తుందట. ఇంతకుముందెప్పుడూ ఇలాంటి క్యారెక్టర్ ఆమె చెయ్యలేదని, ఈ చిత్రంలో ఆమె పాత్రను చూశాకా అందరూ కొత్తగా ఫీల్ అవుతారని తెలుస్తోంది. ఐతే దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పక్కాగా తానూ అనుకున్న విధంగానే చిత్రకరిస్తున్నారు. దాంతో ‘పడి పడి లేచె మనసు’ చిత్ర షూటింగ్ బాగా స్లోగా నడుస్తోందని తెలుస్తోంది.


