“సలార్” వరల్డ్ ప్రీమియర్ కి డేట్, టైం ఫిక్స్

“సలార్” వరల్డ్ ప్రీమియర్ కి డేట్, టైం ఫిక్స్

Published on Apr 14, 2024 9:08 AM IST


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా శృతి హాసన్ (Sruthi Haasan) హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్ సీజ్ ఫైర్” (Salaar Cease Fire) కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం థియేటర్స్ లో భారీ వసూళ్లు అందుకొని ప్రభాస్ కెరీర్ లో ఆల్ టైం సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి అదరగొట్టింది.

ఇక తర్వాత ఓటిటిలో కూడా సాలిడ్ రెస్పాన్స్ ని అందుకోగా ఈ చిత్రం ఇప్పుడు స్మాల్ స్క్రీన్ ని హిట్ చేసేందుకు వస్తుంది. ఈ సినిమా తెలుగు శాటిలైట్ హక్కులు స్టార్ మా వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈ ఏప్రిల్ 21న సాయంత్రం ఐదున్నరకి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.

మరి స్మాల్ స్క్రీన్ మీద సలార్ ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ క్రేజీ మ్యూజిక్ అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ ఏడాదిలోనే సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం కూడా మొదలు కానున్నట్టుగా స్ట్రాంగ్ బజ్ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు