ఆ సెన్సేషన్ సింగర్ కి 55లక్షల ఇల్లు ఇచ్చిన సల్లూభాయ్

Published on Aug 28, 2019 3:01 pm IST

సోషల్ మీడియా సంచలనాలలోనే పెను సంచలనంగా ఈ సంఘటన నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. దేవుని మాయ తప్ప మరొకరు చేయలేని అద్భుతాలు సోషల్ మీడియా చేసిచూపిస్తుంది.నేడు రానూ మండల్ అనేది దేశవ్యాప్తంగా తెలిసిన ఓ గాయని పేరు, కానీ ఒకనాడు ఆమె కూటి కోసం రైల్వే స్టేషన్ లో పాటలు పడుతూ దుర్భర జీవితం గడిపిన ఒక అనామకురాలు.

ఒకప్పటి బిచ్చగత్తెని సోషల్ మీడియా నేషనల్ సెలెబ్రిటీని చేసింది.ఓ ప్రయాణికుడు రైల్వే స్టేషన్ లో ఆమె పాటను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ పాట వైరల్ గా మారింది. దీనితో ఆమె ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. ఆమె కలలో కూడా ఊహించని పేరు, జీవితం వచ్చిపడింది. ఇప్పటికే ఆమె అనేక జాతీయ మాధ్యమాలలో కనిపించారు. హిమేష్ రేష్మియా ఆమెకు పాడే అవకాశం ఇచ్చారు.

వీటన్నింటిని మించి ఆమె గానం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కి తెగ నచ్చేసింది. ఆయన తాజా చిత్రం దబాంగ్ 3లో ఓ పాటను పాడే అవకాశం ఇవ్వడంతో పాటు, ఆమెకు ముంబైలో 55 లక్షల విలువైన ఇంటిని కానుకగా ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. నిజంగా రానూ మండల్ జీవితంలో జరిగిన ఈ అద్భుతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

సంబంధిత సమాచారం :