వాయిదా పడినా,వచ్చేది పక్కా అంటున్న స్టార్ హీరో

Published on Aug 26, 2019 10:46 am IST

సల్మాన్ ఖాన్ చుల్ బుల్ పాండేగా ఏడాది చివర్లో సందడి చేయనున్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో ఆయన నటించిన దబాంగ్ 3 డిసెంబర్ 20 న విడుదల చేయనున్నట్లుగా కొద్దిరోజుల క్రితం ప్రకటించడం జరిగింది. కాగా సల్మాన్ తన తదుపరి చిత్రంగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఇన్షాల్లా చేయనున్నారు.సల్మాన్ సరసన అలియా భట్ నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఈద్ కానుకగా విడుదల చేయాలన్నది ప్రణాళిక.

సల్మాన్ కొన్నేళ్లుగా ప్రతి రంజాన్ కి ఒక చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది కూడా పండుగ కానుకగా ఇన్షాల్లా విడుదల చేయాలనుకున్నారు. ఐతే ఈ చిత్ర చిత్రీకరణ వాయిదాపడిందని తెలుస్తుంది. ఐతే దీనితో సల్మాన్ చిత్రం వచ్చే రంజాన్ కి రాగలదా లేదా అని ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారి అనుమానాలు నివృత్తి చేస్తూ సల్మాన్ ఓ ట్వీట్ చేశారు. సంజయ్ లీలా భన్సాలీ మూవీ వాయిదా పడిన విషయం నిజమే కానీ, 2020 ఈద్ కి నా చిత్రం ఉంటుందంటూ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

సంబంధిత సమాచారం :