యశోద సక్సెస్ పై సమంత కీలక వ్యాఖ్యలు!

యశోద సక్సెస్ పై సమంత కీలక వ్యాఖ్యలు!

Published on Nov 20, 2022 4:42 PM IST

స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి హారి, హరీష్ లు దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం రెండవ వారం లోకి ఆడుగు పెట్టి, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించడం పట్ల హీరోయిన్ సమంత సోషల్ మీడియా వేదిక గా కీలక వ్యాఖ్యలు చేశారు.

యశోద చిత్రం రెండవ వారాంతం మా అంచనాలను మించి పోయింది, ఆడియెన్స్ థియేటర్ల కి వస్తున్నప్పుడు సంతోషం గా ఉంది. ఈ వారం విడుదలైన సినిమాలు కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు