‘హను మాన్’ టీజర్ పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

‘హను మాన్’ టీజర్ పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Nov 21, 2022 5:00 PM IST

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ సూపర్ హీరో యాక్షన్ మూవీ హను మాన్. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఎంతో భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అందరిలో మంచి హైప్ ఏర్పరిచిన హను మాన్ మూవీ నుండి నేడు అఫీషియల్ టీజర్ ని రిలీజ్ చేసింది యూనిట్.

అదిరిపోయే విజువల్స్, గ్రాఫిక్స్, వండర్ఫుల్ యాక్షన్ సీన్స్, అలరించే బీజీఎమ్ తో ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుని దూసుకుపోతోంది. కాగా కొద్దిసేపటి క్రితం హను మాన్ టీజర్ పై టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పొగడ్తలు కురిపించారు. కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన హను మాన్ టీజర్ చూశానని, టీజర్ అదిరిపోయిందని, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టేకింగ్ బాగుండడంతో పాటు హీరో టీజర్ లో హీరో తేజ సజ్జ కూడా వండర్ఫుల్ గా పెర్ఫార్మ్ చేసారని, యూనిట్ మొత్తానికి తన తరపున ముందస్తుగా అభినందనలు తెలియచేస్తున్నాను అంటూ సమంత పెట్టిన ఇంట్రెస్టింగ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు