శకుంతల పాత్ర పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Mar 24, 2023 12:00 am IST

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం నటించిన మైథలాజికల్ పాన్ ఇండియన్ మూవీ శాకుంతలం. గుణశేఖర్ తెరకెక్కించిన ఈ మూవీలో శకుంతల గా సమంత నటిస్తుండగా దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నారు. ఇప్పటికే శాకుంతలం నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఆడియన్స్ ని సమంత ఫ్యాన్స్ ని ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. దిల్ రాజు సమర్పిస్తున్న ఈ మూవీని గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఏప్రిల్ 14న ఈ మూవీ గ్రాండ్ లెవెల్లో పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

దానితో యూనిట్ ప్రమోషన్స్ ని వేగవంతంగా చేస్తున్నారు. నేడు ముంబై లో జరిగిన శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా మూవీ యొక్క అనుభవాలు పంచుకున్నారు సమంత. తన కెరీర్ లో చేసిన బెస్ట్ పాత్రల్లో ఒకటిగా శకుంతల పాత్ర నిలిచిపోతుందని అన్నారు. ఇటువంటి గొప్ప పాత్ర చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని, తప్పకుండా శాకుంతలం రిలీజ్ తరువాత అందరూ గర్వపడరని అన్నారు. దర్శకుడు గుణశేఖర్ ఎంతో గొప్ప టాలెంట్ కలిగిన వ్యక్తి అని, అలానే ఇంత మంచి టీమ్ తో వర్క్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం అని అన్నారు.

సంబంధిత సమాచారం :