తమ టాటూల రహస్యాన్ని బయటపెట్టిన సమంత !

Published on Jul 2, 2018 7:37 pm IST


తెలుగు,తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే సమంత, నాగచైతన్యతో పెళ్లిపీటలు ఎక్కింది. పెళ్లైన తర్వాత కూడా సినిమాలను కంటిన్యూ చేస్తూ వరుసగా హిట్లు కొడుతుంది. ఐతే కెరీర్‌ ఎంత పీక్స్‌కు వెళ్ళినా,ఎప్పుడు ఒకేలా వాస్తవానికి దగ్గరగా ఉండటానికే సమంత ఇష్టపడుతుందట. అందుకే నాగచైతన్యతో సహా తమ చేతిపై ‘బాణాలను’ టాటూగా వేయించుకున్నారు.

కాగా టాటూలకు ‘‘వాస్తవంలో మీలా మీరు ఉండండి’’ అని అర్ధం వస్తుందని ఆ టాటూల రహస్యాన్ని సమంతా రివీల్ చేసింది. ప్రస్తుతం నాగచైతన్య ‘సవ్యసాచి’, ‘శైలజా రెడ్డి అల్లుడు’ నటిస్తుండగా సమంత తమిళ సినిమాల్లో నటిస్తోంది. వీళ్లిద్దరూ కలసి శివనిర్వాణ దర్శకత్వంలో నటించనున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :