ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేసిన సమంత !

Published on Oct 18, 2021 6:20 pm IST

హీరోయిన్‌ సమంత ఫిట్‌నెస్‌ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఈ క్రమంలో తాజాగా సమంత జిమ్‌ లో కసరత్తులు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ఈ వీడియోలో సామ్ 30 కిలోల బరువున్న డంబెల్స్‌తో కుస్తీ పడుతూ కనిపించింది. ఇక ఈ వీడియో తో పాటు ఒక సందేశాన్ని కూడా ప్రేక్షకులతో పంచుకుంది. తన కోచ్ డాక్టర్ స్నేహ దేసు కి తన పై ఉన్న నమ్మకం పై కూడా సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేసింది.

స్నేహ దేసుకి జిమ్‌ లో లేక పోయినా తనను భయపెడుతున్నారంటూ స్నేహనుద్దేశించింది సామ్ కామెంట్స్ చేసింది. కేవలం స్నేహ దేసుకి కారణంగానే ఎవరికీ సాధ్యం కాని రీతిలో 30 కిలోల బరువెత్తాను అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఇక నాగ చైతన్యతో విడాకుల అనంతరం.. సమంత సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం సమంత రెండు సినిమాలు అంగీకరించిందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :