ఫేవరెట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్దమవుతున్న సమంత !
Published on Dec 1, 2017 11:00 am IST

స్టార్ హీరోయిన్ సమంత త్వరలో తనకిష్టమైన ప్రాజెక్ట్ ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని వినికిడి. 2016 లో విడుదలైన కన్నడ థ్రిల్లర్ ‘యు-టర్న్’ భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అంటే చాలా ఇష్టం. ఈ సినిమాను రీమేక్ చేయాలని ఆమె ఎన్నాళ్లగానో అనుకుంటున్నారు. గతంలో చిత్ర దర్శకుడు పవన్ కుమార్ ను కూడా పలుసరాలు కలిస్ చర్చలు జరిపారామె.

ఎట్టకేలకు ఆ తరుణం రానే వచ్చింది. త్వరలోనే ఆమె ఈ ప్రాజెక్టును లాంచ్ చేయనున్నారట. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను రీమేక్ చేస్తారట. ఇకపోతే సమంత ప్రస్తుతం ‘రంగస్థలం 1985, మహానటి, అభిమన్యుడు’ వంటి సినిమాలతో పాటు శివ కార్తికేయన్, విజయ్ సేతుపతి సినిమాల్లో సైతం నటిస్తున్నారు.

 
Like us on Facebook