జూన్ నుండి షూటింగ్ మొదలుపెట్టనున్న సమంత ?

15th, May 2017 - 06:14:59 PM


కోలీవుడ్ స్థార్ హీరో విజయ్ తన 61వ సినిమాను అట్లీ డైరెక్షన్లో చేస్తున్నారు. ఇందులో విజయ్ త్రిపాత్రాభినయం చేస్తుండగా ఒక్కో పాత్రకు ఒక్కో హీరోయిన్ ను నిర్ణయించారు. ముందుగా మొదటి హీరోయిన్ నిత్యా మీనన్ పై సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఇక రెండవ విజయ్ పాత్రకు జోడీగా కాజల్ నటిస్తోంది. ప్రస్తుతం విజయ్ కు, ఆమెకు సంబందించిన షూటింగ్ జరుగుతోంది.

అది కూడా పూర్తవగానే మూడవ విజయ్ పాత్రపై సన్నివేశాల చిత్రీకరణ ఉంటుంది. ఈ పాత్రకు జోడీగా సమంతను అనుకున్నారు. కనుక సమంత జూన్ నెల నుండి షూటింగ్లో పాల్గొనే అవకాశాలున్నాయని వినికిడి. ఈ మూడవ పాత్రలో విజయ్ ఒక మెజీషియన్ గా కనిపిస్తాడని, ఆ పాత్రలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని తమిళ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.