
తమిళ స్టార్ హీరో విక్రమ్, సమంతలు హీరో హీరోయిన్లుగా తమిళంలో రూపొందుతోన్న క్రేజీ రోడ్ ట్రిప్ సినిమా ’10 ఎంద్రతుకుల్ల’. తెలుగులో మీనింగ్ అంటే ‘పది లెక్కెపెట్టే లోపు’.. ఇలాంటి డిఫరెంట్ టైటిల్ తో రూపొందిన ఈ సినిమా ఓ ఆసక్తికర రోడ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఐ’ తర్వాత విక్రమ్ చేస్తోన్న ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలే ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న సినిమా కావడం కూడా ఈ సినిమాపై ఈ స్థాయి అంచనాలు ఉండడానికి అసలైన కారణం.
ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ నుంచి క్లీన్ యు సొంతం చేసుకున్న ఈ సినిమాని అక్టోబర్ 21న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొండినా ఈ సినిమాలో ముఖ్యంగా ఛేజింగ్ సీన్స్, విక్రమ్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, సమంత కొత్త లుక్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి. తెలుగులో కూడా విక్రమ్, సమంతలకి మంచి క్రేజ్ ఉండడం వలన ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

