దగ్గుబాటి రానా తమ్ముడి సినిమాలో తమిళ నటుడు..!

Published on Jul 25, 2021 2:08 am IST


దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సురేష్ బాబు నిర్మిస్తున్నారు. హంగు ఆర్భాటాలు లేకుండా సైలెంట్‌గా రూపొందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. తాజాగా ఈ సినిమా కోసం తమిళ నటుడు సముద్రఖనిని చిత్ర బృందం సంప్రదించినట్టు తెలుస్తుంది.

దర్శకుడు నుంచి నటుడిగా మారిన సముద్రఖని ఈ మధ్య వరుస సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయారు. అలవైకుంఠపురములో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’, మహేశ్ సర్కార్ వారి పాట, ఆర్ఆర్ఆర్‌లో కూడా ఓ కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే సముద్రఖని వంటి సీనియర్ స్టార్ వల్ల సినిమాకు వెయిట్ పెరుగుతుందనే ఉద్దేశ్యంతోనే అభిరామ్ సినిమాకు ఈయనను సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :