కన్మణి దర్శకత్వంలో సందీప్ కిషన్.

కన్మణి దర్శకత్వంలో సందీప్ కిషన్.

Published on Sep 11, 2014 9:30 PM IST

sandeep_kishan

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సూపర్ హిట్ తర్వాత మరోసారి హీరో సందీప్ కిషన్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా.కె.నాయుడు, నిర్మాత జెమినీ కిరణ్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాకు ‘నా ఊపిరి’ ఫేం కన్మణి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఫస్ట్ టైం సందీప్ కిషన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

సందీప్ కిషన్ సరసన సురభి హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో ఆమెకిదే తొలి సినిమా. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతుందని సమాచారం. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, ఉషా కిరణ్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు