‘కేజీఎఫ్ 2’ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

Published on Jul 19, 2021 5:45 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా షార్ప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అందుకే ఈ సినిమా సీక్వెల్ కోసం యాక్షన్ జోనర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. `కేజీఎఫ్ చాప్టర్- 2`లో ప్రధానమైన ప్రతినాయకుడి పాత్ర అధీరాగా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే, సంజయ్ దత్ కి సంబంధించిన పార్ట్ సినిమాలోనే హైలైట్ గా నిలుస్తోందని.. ముఖ్యంగా హీరో విలన్ గా చనిపోతే.. విలన్ గా ఉన్న సంజయ్ దత్ పాత్ర హీరోగా టర్న్ తీసుకుంటుందని ఫిల్మ్స్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మరి సినిమా రిలీజ్ అయితే గాని, ఈ పాత్ర పై క్లారిటీ రాదు. ఇక హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తోంది.

యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న కొన్ని మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి పార్ట్ బంపర్ హిట్ కావడంతో ఈ చిత్రం కోసం అన్ని భాషలలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇంతకీ కేజీఎఫ్ అనగా కోలార్ బంగారు గ‌నులు. ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

సంబంధిత సమాచారం :