నా బిడ్డ రాక కోసం ఎదురు చూస్తున్నాను – సంజన గల్రాని

Published on Feb 21, 2022 11:00 am IST


బోల్డ్ హీరోయిన్ ‘సంజన గల్రాని’ తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సంజనా మాట్లాడుతూ.. ‘నేను గర్భవతిని అని తెలిసిన తర్వాత చాలా ఎమోషనల్ అయ్యాను. తల్లిగా మారేందుకు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. నా బిడ్డ కోసం నేను ఈ లోకంలో ఎంతగానో శ్రమిస్తాను’ అని చెప్పుకొచ్చింది.

గతంలో కూడా సంజనా ఇలాగే ఎమోషనల్ అవుతూ మెసేజ్ చేసింది. నేను ప్రసవం అయ్యేంత వరకు శ్రమిస్తాను. అనేక మంది మహిళలు తమ ప్రసవం తేదీకి రెండు వారాల ముందు వరకు అనేక పనులు చేయడం నేను చాలాసార్లు చూశాను. అందుకే, నేను కూడా ఇదే విధంగా పని చేయాలని నిర్ణయించుకున్నాను’ అని ఆమె అప్పుడు చెప్పుకొచ్చింది.

ఇక సంజన డ్రగ్స్‌ కేసులో అరెస్టయి, మూడు నెలల జైలు జీవితం కూడా గడిపింది. జైలు జీవితం నుంచి బెయిల్‌ పై ఆమె విడుదలయ్యాక, వెంటనే అజీజ్‌ బాషా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది. ఇక వీరి పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులను మిత్రులను మాత్రమే ఆహ్వానించారు. పైగా సంజనా గల్రానీ ఇస్లాం మతాన్ని కూడా స్వీకరించింది.

సంబంధిత సమాచారం :