‘బాహుబలి-2’ రికార్డును బ్రేక్ చేసిన ‘సంజు’ !

Published on Jul 2, 2018 1:34 pm IST

బాక్సాఫీస్ వద్ద ‘సంజు’ హావా కొనసాగుతూనే ఉంది. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఆదివారం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ ఒక్క రోజులోనే రూ.46.71 కోట్లను కలెక్ట్ చేసి కొత్త రికార్డును సృష్టించింది ఈ చిత్రం. ఇంతకుముందు ‘బాహుబలి-2’ రూ.46.5 కోట్ల వసూళ్లను సాధించి రికార్డు క్రియేట్ చేస్తే తాజాగా ‘సంజు’ ఆ రికార్డును క్రాస్ చేసింది.

ఇక మూడు రోజులకు గాను ఈ చిత్రం రూ.120 కోట్లను ఖాతాలో వేసుకుంది. రానున్న రోజుల్లో ఈ చిత్రం మరిన్ని రికార్డులను నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తోంది. ప్రస్తుతం పెద్ద చిత్రాల విడుదల లేకపోవడంతో ఈ రన్ ఇలాగే కొనసాగనుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ దత్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :