బిగ్ ఫైట్ : ఈసారి సంక్రాంతికి పవన్ కళ్యాణ్ వర్సెస్ రాఖీ బాయ్

Published on Sep 19, 2020 12:06 am IST


ఈసారి సంక్రాంతికి సినిమాల పోటీ హోరాహోరీగా ఉండనుంది. ఇప్పటికే థియేటర్లు మూతపడి 5 నెలలు పైనే కావొస్తుండటంతో సినీ ప్రేక్షకులు సినిమా హాల్లో సినిమాను ఎంజాయ్ చేయాలని చాలా ఆశగా ఉన్నారు. సినిమా హాళ్లు పూర్తిస్థాయిలో సంక్రాంతి నాటికి తెరుచుకునే అవకాశం ఉంది. నిర్మాతలు, పెద్ద హీరోలు, దర్శకులు సంక్రాంతి సీజన్లోనే తమ సినిమాలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమాల్లో పవన్ కళ్యాణ్ చేస్తున్న ‘వకీల్ సాబ్’ కూడ ఉంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇంకొద్ది భాగమే చిత్రీకరణ మిగిలి ఉంది. త్వరలోనే సినిమా పూర్తవుతుందని, సంక్రాంతి సందర్బంగా జనవరి 14న చిత్రాన్ని విడుదల చేస్తారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇక అదే సమయానికి భారీ బడ్జెట్ చిత్రం ‘కెజిఎఫ్ 2’ విడుదలకానుందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా యొక్క మొదటి పార్ట్ ‘కెజిఎఫ్’ దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. ముఖ్యంగా తెలుగులో ఊహించని రీతిలో హిట్టైంది. అందుకే కన్నడ భాషలో సినిమాపై ఎంత హైప్ ఉందో తెలుగులో కూడ అంతే హైప్ ఉంది. కాబట్టి సంక్రాంతికి ఈ సినిమా విడుదలైతే బాక్సాఫీస్ వద్ద ‘వకీల్ సాబ్ వెర్సెస్ రాఖీ భాయ్’ అన్నట్టు ఉంటుంది వాతావరణం. అయినా కరోనా ఆందోళనతో థియేటర్లకు రావాలా వద్దా అనే సందేహంలో ఉన్న ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలంటే ఈమాత్రం పోటీ ఉండాల్సిందే కదా.

ఈ రెండు సినిమాలే కాదు.. ఇంకొన్ని ఆసక్తికరమైన చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉంది. అఖిల్, పూజా హెగ్డేల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, రవితేజ ‘క్రాక్’, గోపిచంద్ ‘సీటిమార్’, నాగచైతన్య ‘లవ్ స్టోరీ’లు కూడ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More