కొనసాగుతున్న సర్ధార్ డిస్ట్రిబ్యూటర్ నిరాహార దీక్ష..!


గత కొన్ని వారాలుగా పవన్ చిత్రం ‘సర్ధార్ గబ్బర్ సింగ్’కృష్ణా ఏరియా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన సంపత్ కుమార్ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.ఆ చిత్ర బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో తాను రూ 2 కోట్లు నష్టపోయి రోడ్డున పడ్డానని సంపత్ చెబుతున్నాడు.

ఆ చిత్ర నిర్మాత శరత్ మరార్, పవన్ కళ్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ తదుపరి పవన్ చిత్ర హక్కులను ఇచ్చి ఆదుకుంటామని మాట ఇచ్చారని, కానీ కాటమరాయుడు కృష్ణా ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను వేరే వ్యక్తికి అధిక ధరకు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నాడు.ఈ విషయంలో తనకు న్యాయం జరగాలని నిన్న ఫిలిం ఛాంబర్ వద్ద నిరాహార దీక్షకు దిగాడు. అతడి దీక్ష రెండో కూడా కొనసాగుతోంది.పవన్ కళ్యాణ్ తనని పిలిచి న్యాయం చేస్తానని మాట ఇచ్చే వరకు నిరాహార దీక్ష విరమించేది లేదని సంపత్ స్పష్టం చేస్తున్నాడు.