వరల్డ్ వైడ్ భారీ గ్రాస్ వైపు “సర్కారు వారి పాట” వసూళ్లు.!

Published on May 23, 2022 8:06 pm IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ ని మెప్పించి ఈ రెండు వారాంతాల్లో సాలిడ్ రన్ ని థియేటర్స్ లో చూపించింది.

దీనితో మహేష్ కెరీర్ లో ఈ సినిమా భారీ వసూళ్లను అందుకున్న మరో సినిమాగా నిలవగా ఇప్పుడు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ గ్రాస్ మార్క్ వైపు దూసుకెళ్తున్నట్టుగా ట్రేడ్ వర్గాల వారు తెలుపుతున్నారు. మరి ఈ చిత్రం ప్రస్తుతానికి 196 కోట్ల మేర గ్రాస్ మార్క్ దగ్గర ఉండగా ఈ రెండు రోజు డెఫినెట్ గా ఈజీగా 200 కోట్ల మార్క్ ని టచ్ చెయ్యడానికి రెడీగా ఉంది.

దీనితో మహేష్ కెరీర్ లో ఈ సినిమా మరో రికార్డు గ్రాసర్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :