యూఎస్ లో కంటిన్యూ అవుతున్న “సర్కారు వారి పాట” హవా.!

Published on May 18, 2022 10:01 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. భారీ అంచనాల నడుమ వచ్చి ఈ చిత్రం భారీ రెస్పాన్స్ తో రికార్డు స్థాయి వసూళ్ళని కొల్లగొడుతుంది.

అయితే ఇదిలా ఉండగా ఈ చిత్రం రిలీజ్ అయ్యాక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా అదిరే వసూళ్లను ఈ చిత్రం రాబడుతూ సూపర్ స్ట్రాంగ్ గా నిలిచింది. మరి లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2.1 మిలియన్ డాలర్స్ మార్క్ దగ్గరకి చేరుకొని హవా కొనసాగిస్తోంది.

ఇక ఫైనల్ రన్ లో ఎక్కడ ఆగుతుందో చూడాలి. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :