స్పెషల్ డే కి “సర్కారు వారి పాట” షూటింగ్ పూర్తి..వివరాలు ఇవే.!

Published on Apr 12, 2022 10:20 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మహేష్ ని నెవర్ బిఫోర్ లెవెల్లో ప్రెజెంట్ చేస్తుండడంతో మరింత అంచనాలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు.

మరి ఫైనల్ గా ఈ చిత్రం షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యినట్టు అధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది. మొత్తం టాకీ పార్ట్ ని పూర్తి చేసేయగా ఇంకా కేవలం ఒకే ఒక్క సాంగ్ చిత్రీకరణ చేసుకోవాల్సి ఉందట. ఇది కూడా త్వరలోనే ఫినిష్ చేసేయి డెఫినెట్ గా మే 12 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫామ్ చేసారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ఇంకా సరిగ్గా ఒక్క నెల మాత్రమే ఉండగా కంప్లీట్ అవ్వడం గమనార్హం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :