‘రణరంగం’ టీజర్- అణచివేతను ఎదిరించి ఎదిగిన గ్యాంగ్ స్టర్ కథ.

‘రణరంగం’ టీజర్- అణచివేతను ఎదిరించి ఎదిగిన గ్యాంగ్ స్టర్ కథ.

Published on Jun 29, 2019 5:02 PM IST

హీరో శర్వానంద్ ,కాజల్ అగర్వాల్,కళ్యాణి ప్రియదర్శి ప్రధానపాత్రలలో తెరకెక్కుతున్న మూవీ “రణరంగం”. స్వామి రారా ఫేమ్ దర్శకుడు సుధీర్ వర్మ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. పి డి పి ప్రసాద్ సమర్పిస్తుండగా,సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.

టీజర్ శర్వానంద్ చెప్పిన “దేవుడ్ని నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోద్ది కానీ…మనిషి నమ్మాలంటే ధైర్యం ఉండాలి” అనే ఫిలసాఫికల్ డైలాగ్ తో ప్రారంభమైంది. టీజర్ లో శర్వానంద్ రెండు డిఫరెంట్ గెట్ అప్స్ లో కనిపిస్తున్నాడు, ఒకటి గ్యాంగ్ స్టర్ లుక్ ఐతే మరొకటి 90లనాటి సామాన్య యువకుడి లుక్. ఇక ట్రైలర్ మొత్తం చూస్తే కథపైన ఒక అవగాహన కూడా వస్తుంది.

పోర్టులో కూలీలుగా జీవనం సాగించే హీరో అతని స్నేహితులు మాఫియాకి ఎదురు నిలిచి, శర్వానంద్ మరో మాఫియా లీడర్ గా ఎదుగుతాడనిపిస్తుంది.శర్వానంద్ 90లలో ఒక సామాన్యుడిగా ఉన్నప్పుడు పాత్రలో హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శి, గ్యాంగ్ స్టర్ గా ఎదిగిన తరువాత ప్రెసెంట్ లో హీరోయిన్ గా కాజల్ కనిపిస్తుంది. టీజర్ చివర్లో శర్వానంద్ చెప్పే “కోపాన్నీ,దాహాన్ని ఇంకొకడు శాసించే పరిస్థితిలో మనం ఉండకూడదు” అనే డైలాగ్ వారి జీవితాలపై ఒకరి పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఉంది. శర్వానంద్ రెండు గెట్ అప్ లలో బాగున్నాడు. ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో కట్ చేసిన ‘రణరంగం’ టీజర్ ఆసక్తికరంగా ఉంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు