లేటెస్ట్..తారక్ చేతుల మీదుగా “తిమ్మరుసు” ట్రైలర్.!

Published on Jul 25, 2021 1:51 pm IST

తన లాస్ట్ చిత్రం “ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య” చిత్రంతో టాలీవుడ్ లో మరింత గుర్తింపుని తెచ్చుకున్న టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఆ సినిమా ఓటిటిలోనే వచ్చినా ఆడియెన్స్ లో మాత్రం మంచి ఇంపాక్ట్ ని సత్యదేవ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ చిత్రం తాను చేస్తున్న ప్రతి సినిమాపై కూడా మంచి హైప్ ను తెచ్చుకోగా వాటిపై మంచి ప్రమోషన్స్ కూడా ఇప్పుడు నడుస్తున్నాయి.

అయితే మరి వాటిలో శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “తిమ్మరుసు” కూడా ఒకటి. మంచి బజ్ సంతరించుకున్న ఈ చిత్రం రిలీజ్ కి రెడీగా ఉండగా ఈ సినిమా ట్రైలర్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతులు మీదుగా రిలీజ్ చెయ్యడానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రేపు జూలై 26 సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు విడుదల చేయిస్తున్నట్టుగా నిర్మాత మహేష్ కోనేరు తెలిపారు. అంతే కాకుండా తారక్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.

సంబంధిత సమాచారం :