మరో కమెడియన్ హీరోగా ఎంట్రీ !
Published on Oct 26, 2017 2:33 pm IST

‘సత్యం’ సినిమాలో తన కామిడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కామిడియన్ సత్యం రాజేష్, ఆ సినిమా తరువాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆ మధ్య ‘నాయకి’ సినిమాలో త్రిషతో పాటు ప్రధాన పాత్రలో నటించాడు రాజేష్. ఆ సినిమా తరువాత మరే సినిమాలో హీరోగా నటించినప్పటికీ కామిడీ పాత్రలు చేస్తూ వస్తున్నాడు. చాలా గ్యాప్ తరువాత రాజేష్ కు సెట్ అయ్యే ఒక కథ వినిపించాడు డైరెక్టర్ రాజా కిరణ్.

‘గీతాంజలి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాజా కిరణ్ ఆ తరువాత ‘త్రిపుర’, ‘లకున్నోడు’ సినిమాలు తీసాడు. ఆ సినిమాలు ఆశించిన విజయం సాదించలేకపోయాయి. దాంతో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డితో చేసిన ‘గీతాంజలి’ తరహాలోనే సత్యం రాజేష్ తో సినిమాను ప్లాన్ చేశారు రాజా కిరణ్. త్వరలో ప్రారంభం అయ్యే ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుందాం. డీఎంఈకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

 
Like us on Facebook