రెండోసారి డీసెంట్ టీఆర్పీ రేటింగ్ రాబట్టిన “స్కంద”

రెండోసారి డీసెంట్ టీఆర్పీ రేటింగ్ రాబట్టిన “స్కంద”

Published on Mar 7, 2024 11:08 PM IST


టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని అలరించింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర పై సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా, రెండో సారి కూడా డీసెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రం రెండోసారి 5.83 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఇది మంచి రెస్పాన్స్ అని చెప్పాలి. రామ్ పోతినేని చిత్రాలకి ఎలాంటి క్రేజ్ ఉందనేది ఈ రేటింగ్ ను చూస్తే తెలుస్తుంది. సాయి మంజ్రేకర్, శ్రీ లీల లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు