సెన్సార్ పూర్తిచేసుకున్న ‘సీత రాముని కోసం’ !
Published on Dec 6, 2017 2:38 pm IST

ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ ‘సీత రాముని కోసం’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ సినిమాపై మంచి ఆసక్తిని క్రియేట్ చేశాయి. అన్ని పనుల్ని పూర్తిచేసుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పనుల్ని కూడా పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను జారీ చేసింది.

‘వైకుంఠపాళి, బిస్కెట్’ వంటి సినిమాల్ని తెరకెక్కించిన అనిల్ గోపిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే, సంగీతం అందివ్వడం విశేషం. ఒక అమ్మాయి మగవాడిని ప్రేమించడం మొదలుపెడితే ఎంతలా ప్రేమిస్తుంది, చనిపోయిన తర్వాత కూడా ఆ ప్రేమను ఎలా చూపుతుంది అనేది ఈ సినిమాలో ప్రధాన కాన్సెప్ట్ అని దర్శకుడు అనిల్ గోపిరెడ్డి తెలిపారు. ఇందులో శరత్, కారుణ్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో తాగుబోతు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. నందన్, సరితా గోపిరెడ్డి, శిల్ప సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలకానుంది.

 
Like us on Facebook