“సీటీమార్” విడుదల తేదీ రేపు తేలిపోనుంది..!

Published on Aug 19, 2021 12:59 am IST

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “సీటిమార్”. కబడ్డీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో గోపిచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే మళ్లీ ఇప్పుడు థియేటర్స్ తెరుచుకోవడంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

ఈ నేపధ్యంలో ఈ నెల 20వ తేదిన ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని అనౌన్స్ చేశారు. అయితే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. మరీ ఈ డేట్‌నే ఫైనల్ చేస్తారా లేక మరేదైనా డేట్‌ని ప్రకటిస్తారా అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :