శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాని?

ఫిదా సినిమాతో మంచి విజయం సాధించిన దర్శకుడు శేఖర్ కమ్ముల తరువాతి సినిమా నానితో చెయ్యబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎసియన్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోందనిసమాచారం. ఏసియన్ సంస్థ ఇదివరుకు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉంది. మొదటిసారి సినిమా నిర్మాణంపై ఆసక్తిక ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నట్లు సమాచారం.

సహజంగా సినిమాలు తియ్యడంలో మంచి పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల నాని తో సినిమా అంటే భారి అంచనాలు ఉంటాయి. నాని కూడా ఈ మద్య సాఫ్ట్ లవ్ స్టోరీస్ చేస్తున్నాడు. అదే తరుహలో వీరిద్దరి సినిమా ఉండబోతోందేమో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. నాని నిర్మించిన అ సినిమా ఈ నెల 16 న విడుదల కానుంది.