మహేష్ బాబు సినిమాలో సీనియర్ హీరో ?

మహేష్ బాబు సినిమాలో సీనియర్ హీరో ?

Published on May 10, 2022 2:17 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమాలో మరో కీలక పాత్ర ఉందని, ఆ పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్నాడని తెలుస్తోంది. కాగా రాజశేఖర్ ది మహేష్ కి బాబాయ్ పాత్ర అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. జులై నుంచి షూట్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ముందుగా మహేష్ పై సోలో సాంగ్ ను అలాగే ఒక ఫైట్ ను తీస్తారట. ఆ తర్వాత లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తారట. ఇక పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు