సెన్సార్ పూర్తి చేసుకున్న సీనియర్ స్టార్ హీరో సినిమా !

24th, March 2017 - 11:32:19 AM


సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం ‘గురు’. చిత్రీకరణకు సంబందించిన అన్ని పనులు ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. స్వయంగా హీరో వెంకటేష్ రంగంలోకి దిగి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగానే ఏ చిత్ర సెన్సార్ పనులు కూడా తాజాగా పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి క్లీన్ ‘U’ సర్టిఫికెట్ జారీ చేసింది.

సూపర్ హిట్ హిందీ చిత్రం ‘సాలా ఖదూస్’ కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని కూడా ఒరిజినల్ వెర్షన్ కు దర్శకత్వం వహించిన సుధా కొంగర డైరెక్ట్ చేశారు. ప్రయోగాత్మక చిత్రాల్ని చేయడం మొదలుపెట్టిన తర్వాత వెంకీ తన లుక్, స్టైల్ ను పూర్తిగా మార్చి చేస్తున్న సినిమా కావడం, విడుదలైన ట్రైలర్ కూడా బాగుండటంతో అభిమానుల్లో, సినీ వర్గాల్లో మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే పలుసార్లు వాయిదాపడిన ఈ చిత్రాన్ని ఈ వేసవికి రిలీజ్ చేయనున్నారు.