దైవబలమే ‘పురాణపండ శ్రీనివాస్’ అని అందంగా చెప్పేసిన సీనియర్ టి.వి.యాంకర్.

దైవబలమే ‘పురాణపండ శ్రీనివాస్’ అని అందంగా చెప్పేసిన సీనియర్ టి.వి.యాంకర్.

Published on Feb 12, 2022 9:58 PM IST

Puranapanda Srinivas

సికింద్రాబాద్ : ఫిబ్రవరి ; 13

మంగళమయ పరమాత్ముని స్మరణమాత్రంచేత అంతా మంగళమయమౌతుందని బలంగా చెపుతారాయన. తిరుమల శ్రీనివాసుని ఆరాధకులకు పరాజయముండదని ఆయన జీవితంలో ఎన్నో ఘటనలు నిరూపించాయి. పరమాత్మ కృపను సంపాదించడానికి ధనధాన్యాలవసరం లేదని, భక్తి భావన ఒక్కటే భగవంతుని అనుగ్రహం పొందడానికి అమోఘసాధనమని అద్భుతమైన ఉదాహరణలతో నిర్మొహమాటంగా చెప్పేస్తారాయన. కొన్ని సందర్భాల్లో ఆయన మాటలు ధనుష్టంకారాల్లా ఉంటాయి. ఇంకొన్ని సందర్భాల్లో ఆయన మాటలు తన్మయింప చేస్తాయి. వేదపురుషుడైన పరమాత్మ ముఖముద్రలోంచి కురిసే వాత్సల్యంకోసం ఎప్పుడూ మంత్రరాజాలమధ్య సంచరించే ఈ ప్రతిభావంతుడే , ఈ అమోఘమైన వక్తే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో వేలకొలది దేవాలయాలలో, లక్షలకొలది భక్తుల పవిత్ర హస్తాలలో ప్రకాశిస్తున్న ఎన్నో రకాల అపురూపపు పుస్తక పరిమళాల రచనా సంకలన కర్త పురాణపండ శ్రీనివాస్ రేయింబవళ్ళ అకుంఠిత కృషి చూస్తే ఆశ్చర్యం కలుగకమానదని ఎందరో అభినందనల ప్రశంసలు వర్షిస్తున్నారు. ఒకటా … రెండా ఎన్ని అమోఘ గ్రంధాలు . ఎన్నెన్ని అనుభూతుల అక్షర పారిజాతాలు. వరుసగా చెప్పుకుంటూ పోతే … ‘ మహామంత్రస్య ‘ , ‘ మహా సౌందర్యం’, ‘ శ్రీపూర్ణిమ’ , ‘ శ్రీమాలిక’ , ‘ శ్రీలహరి’ , ‘ దేవదేవం భజే ‘ , నన్నేలు నాస్వామి’ , ‘ నేనున్నాను’, ‘ ననుగన్న నాతండ్రి ‘ … ఇలా ఎన్నో అద్భుతమైన పవిత్ర వైవిధ్యపు మహా గ్రంధాలు దర్శనమిస్తాయి.

ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క రాజహంస అనే చెప్పాలి. బుక్ గెట్ అప్ మరియు కంటెంట్ మరియు ప్రింటింగ్ అంత అద్భుతంగా వుండటమొక్కటే కాదు, తొంభైశాతం పుస్తకాలు ఉచితంగానే మనకి అందడం మరొక ఆశ్చర్యం. పుస్తకాన్ని వ్యాపారం చేయడాన్ని పురాణపండ తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అందుకే … తెలుగు రాష్ట్రాలు మొదలుకుని అమెరికా, దుబాయ్ వంటి దేశాల వరకూ సినెమా, రాజకీయ, పారిశ్రామిక రంగ ప్రముఖులు శ్రీనివాస్ వివిధ గ్రంధాలకు సమర్పకులుగా వ్యవహరించడం మన కనులముందు కనిపిస్తున్న సత్యం. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఈ ప్రజ్ఞావంతుని మనోహరగ్రంధాలకు కొందరు న్యాయమూర్తులూ, కొందరు ఐఏఎస్ అధికారులూ స్పాన్సర్లుగా వ్యవహరించడం మరొక ఆశ్చర్యంతోకూడిన అద్భుతంగానే చెప్పక తప్పదు.

పుస్తకం అందించడం వెనుక శ్రీనివాస్ తపన, కష్టపడే మనస్తత్వం, అద్భుతమైన భాషా సంస్కారం, వండర్ ఫుల్ బుక్ గెట్ అప్ ….ఇవన్నీ మనల్ని నిజంగానే ఆశ్చర్య పరుస్తాయి. శ్రీనివాస్ మానసిక సంకల్పం, సంకల్ప దృఢత్వం గురించి నాటి సి. నారాయణరెడ్డి, వేటూరి సుందర రామమూర్తి నుంచి నేటి సీనియర్ ఐఏఎస్ అధికారులు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కే.వీ. రమణాచారి , తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జవహర్ రెడ్డి వరకూ ముక్తకంఠంతో ప్రశంసలు వర్షించిన వారే. ఏదేమైనా శ్రీనివాస్ సృజనాత్మక ధార్మిక గ్రంధాలకున్న ఫాలోయింగ్ వేరే లెవెల్లో అనే సినీ రంగం సైతం కోడి కూస్తోంది.

శ్రీనివాస్ అందించిన మంత్ర శబ్దశక్తికి సినీ రంగ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, అశ్వనీదత్, దిల్ రాజు , రోజా వంటి ప్రముఖులెందరో స్పాన్సర్లుగా వ్యహరించడం ఆషామాషీ విషయం కాదు. ఇప్పటి భారతదేశ హోమ్ శాఖామంత్రి అమిత్ షా సైతం శ్రీనివాస్ బుక్ ని న్యూఢిల్లీ మహానగరం లో ఆవిష్కరించడం , పురాణపండని అభినందించడం మామూలు విషయమా . తెలుగు వారిలో శ్రీనివాస్ ఒక్కరే ఇలానే ప్రతిభ, నిస్వార్ధ సేవ దర్శింప చేస్తున్నారని విశ్వహిందుపరిషద్ సమర్ధ ప్రతినిధులు కూడా హైదరాబాద్ లో ఇటీవల ఒక బహిరంగ సభలో బాహాటంగా ప్రకటించారు కూడా. పుస్తకాలకు విలువ తగ్గి ఇంటర్నెట్ కి ప్రాబల్యం పెరిగిన ఈరోజుల్లో కూడా పురాణపండ శ్రీనివాస్ గ్రంథ వైభవానికి నానాటికీ డిమాండ్ పెరగటం దైవబలం కాక మరేమిటని ఒక సీనియర్ టి.వి. యాంకర్, శ్రీనివాస్ చిరకాల స్నేహితురాలు రవీంద్రభారతిలో ఒక సభలో గలగలల నవ్వుల్తో స్పష్టం చేయడాన్ని విజ్ఞులంతా సమర్థిస్తున్నారు కూడా. శ్రీనివాస్ గారి అసాధారణ ప్రతిభనుండి మరొక ఆర్షధర్మ గ్రంధం కోసం చూద్దాం .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు